స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో జాబ్స్‌ నోటిఫికేషన్‌

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రేడ్‌-సి, గ్రేడ్-డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, పలు విభాగాలు, సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో జాబ్స్‌ నోటిఫికేషన్‌ #

ఖాళీల వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. స్టెనోగ్రఫీలో మంచి ప్రావీణ్యం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన అర్హత కలిగినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయస్సు:
  1. గ్రూప్-సి పోస్టులకు 01-08-2020 నాటికి 30 ఏళ్లు దాటకూడదు.
  2. గ్రూప్‌-డి పోస్టులకు 01-08-2020 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
  • ఫీజు:  రూ.100
  • దరఖాస్తు చేసే విధానం: దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే పంపించాలి.
  • చివరి తేదీ: 4 నంబర్‌, 2020

SSC Stenographer పరీక్ష విధానం

ఆన్‌లైన్ విధానంలో పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో 3 విభాగాలు ఉంటాయి.

  1. జనరల్ ఇంటలిజెన్స్
  2. జనరల్ అవేర్‌నెస్‌
  3. జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్‌

ప్రశ్నపత్రాలు ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.

# స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో జాబ్స్‌ నోటిఫికేషన్‌ #

మొత్తం ప్రశ్నలు: 200; మొత్తం మార్కులు: 200; సమయం: 2 గంటలు

0.25 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంది.

స్కిల్ టెస్ట్

స్టెనోగ్రాఫర్‌ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టెనోగ్రఫీ స్కిల్‌ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంగ్లీష్/ హిందీ భాషల్లో 10 నిమిషాల డిక్టేషన్ ఇస్తారు.

గ్రూప్‌-డి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిమిషానికి 80 పదాలు, గ్రూప్‌-సి అభ్యర్థులు నిమిషానికి 100 పదాలు రాయాల్సి ఉంటుంది.

డిక్టేషన్‌ను టైప్ చేయడానికి గ్రూప్‌-డి ఇంగ్లీష్ అభ్యర్థులకు 50 నిమిషాలు, హిందీ అభ్యర్థులకు 65 నిమిషాల సమయం  ఉంటుంది.

గ్రూప్‌-సి ఇంగ్లీష్ అభ్యర్థులకు 40 నిమిషాలు, హిందీ అభ్యర్థులకు 55 నిమిషాల సమయం ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.

అభ్యర్థులు SSC రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా  అంతిమ సెలక్షన్‌ ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు.

పూర్తి వివరాలకు: https://ssc.nic.in/ ను చూడండి.

బ్యాంకు జాబ్స్‌: IBPS క్లర్క్‌ జాబ్స్‌ నోటిఫికేషన్

Leave a Comment

error: Content is protected !!
Open chat
1
Hello,
How can I help you?